ఉపరాష్ట్రపతిగా కాంగ్రెస్ సీనియర్ నేత ?
కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికార బీజేపీ పార్టీ ఆయనను రాజ్యసభకు నామినేట్ చేసి ఉపరాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని చూస్తుంది. వచ్చే ఏడాది జరిగే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన బీజేపీలో ఇప్పటికే చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ రెండు పదవులుకు ఎవరిని ఎన్నుకుంటే సముచితంగా ఉంటుంది అనే విషయంపై అగ్ర నాయకత్వం చర్చలు జరిపినట్లు సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రపతి అభ్యర్థి ఎక్టోరల్ కాలేజీలో వచ్చే మార్పుల ప్రకారం దీనిపై తుది నిర్ణయానికి రానున్నారు. ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రపతి ఎన్నిక కోసం బీజేపీ ఏయే ప్రాంతీయ పార్టీలపై ఎంత మేరకు ఆధారపడల్సి ఉంటుందో తేలుతుంది. పైగా ఈ ఎన్నికల ప్రభావం బీజేపీ రాజ్యసభ సీట్లపై కూడా పడుతుంది. దానిని బట్టి ఉపరాష్ట్రపతి ఏక గ్రీవంగా ఎన్నుకునే అవకాశం ఉంది.
రాష్ట్రపతి ఎన్నిక కోసం శాసనసభ్యులపై కూడా ఆధారపడాల్సి ఉండగా, ఉపరాష్ట్రపతి కోసం కేవలం లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల బలంపై మాత్రమే ఆదారడాల్సి ఉంటుంది. అందుకే రాష్ట్రపతి కన్నా ఉపరాష్ట్రపతిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సులుభమవుతుందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఉపరాష్ట్రపతిగా గులాంనబీ ఆజాద్ పేరు ప్రస్తావనలో ఉన్నట్లు తెలిసింది. గతేడాది వరకు కాంగ్రెస్ రాజ్యసభాపక్ష నేతగా కొనసాగిన ఆజాద్‌ను ఆ పార్టీ మళ్లీ రాజ్యసభకు పంపలేకపోయింది. గతేడాది నుంచి కాంగ్రెస్‌లోని 23 మంది సీనియర్ నేతలో కలిసి ఆజాద్ అడపా దడపా పార్టీ నడుస్తున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. జమ్మూ కశ్మీర్‌కు ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం, కశ్మీర్ వ్యవహారాలపై మంచి అవగాహన ఉన్న గులాంనబీ ఆజాద్‌కు ప్రధాని మోదీతో సత్సంబంధాలు ఉన్నాయి. కేంద్రంలో ప్రస్తుతం బీజేపీయే అధికారంలో ఉన్నందున ఆజాద్ ఎన్నిక సులభవంగా జరుగుతుందని అంచనా వేస్తున్నాయి. మరోవైపు ఆజాద్ కూడా ఇప్పటినుంచే బీజేపీయేతర పార్టీల నాయకులను కలిసి చర్చలు జరపడం ప్రారంభించారు.













