అదానీ-హిండెన్ బర్గ్ వివాదంలో… కేంద్రానికి ఎదురుదెబ్బ
అదానీ-హిండెన్‌బర్గ్ వివాదంపై కేంద్రానికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్టాక్ మార్కెట్లలో నియంత్రణ చర్యలను బలోపేతం చేయడానికి ప్రతిపాదిత నిపుణుల కమిటికీ సీల్డ్ కవర్లో తమ సూచనలు సమర్పిస్తాన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఇన్వెస్టర్ల ప్రయోజనాలను కాపాడే విషయంలో పారదర్శకత పాటించాలని తాము భావిస్తున్నట్లు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్‌లు పీఎస్ నరసింహ, జేబీ పార్దివాలాలతో కూడిన దర్మాసనం స్పష్టం చేసింది. ప్రతిపాదిత నిపుణుల కమిటీకి పేర్లను సీల్డ్ కవర్లో సమర్పిస్తామన్న కేంద్రం నిర్ణయాన్ని ఆమోదించబోమని పేర్కొన్నది. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడాలని మేం కోరుకుంటున్నాం. కనుక సీల్డ్ కవర్లో నిపుణుల కమిటీ ప్రతిపాదనలు సమర్పిస్తామన్న మీ (కేంద్రం) సూచనలను మేం ఆమోదించం అని ధర్మాసనం తెలిపింది.













