కపిల్ సిబాల్ సంచలన వ్యాఖ్యలు .. గాంధీలు ఇక

కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి గాంధీలు తప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మరొక వ్యక్తికి నాయకత్వాన్ని అప్పగించాలని తెలిపారు. 2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత కొన్ని సందర్భాల్లో తప్ప అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతూనే ఉందని సిబాల్ అన్నారు. సీడబ్ల్యూసీలో ఉన్నవారు మాత్రమే పార్టీ నాయకత్వంపై నమ్మకం ఉంచారని, సీడబ్ల్యూసీ వెలుపల ఉన్నవారు కొత్త వ్యక్తికి పార్టీ పగ్గాలను అప్పగించాలని కోరుకుంటున్నారని తెలిపారు. పార్టీని సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలని కోరుతూ సోనియాగాంధీకి గతంలో రాసిన లేఖపై సంతకం చేసిన వారిలో కపిల్ సిబాల్ కూడా ఉన్నారు.











































































