ఏడాదిపాటు గగన్‌యాన్ వాయిదా
కరోనా మహమ్మారి ప్రతికూలతలు కారణంగా ఇస్రో తలపెట్టిన మానవ సహిత అంతరిక్ష ప్రయోగం ఏడాది పాటు గగన్‌యాన్ వాయిదా వేస్తున్నట్లు ఇస్రో చైర్మన్ శివన్ తెలిపారు. మిషన్‌ను ఈ ఏడాది డిసెంబర్, జులై 2021లో ప్రారంభించాలని తొలుత షెడ్యూల్లో నిర్ణయించారు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో తాజాగా షెడ్యూల్లో మార్పులు చేశారు. వచ్చే ఏడాది చివరిలో లేదా 2022లో ఎప్పుడైనా మిషన్‌ను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. గగన్‌యాన్‌లో భాగంగా ముగ్గురు వ్యోమోగాములులో ఎర్త్ అర్బిట్కు (ఎల్ఈవో) వెళ్లి తిరిగి సురక్షితంగా భూమికి చేరడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. మానవరహిత అంతరిక్ష మిషన్కోసం పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో ఓ రోబోను రూపొందించాలని ఇస్రో ఇప్పటికే ప్రణాళిక రూపొందించింది. ప్రముఖ ఇంజినీరింగ్ సంస్థ ఎల్అండ్టీ ఈ ప్రయోగానికి సంబంధించి మొదటి హార్డ్‌వేర్ బూస్టర్ విభాగాన్ని తయారు చేసిది. ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఘన చోదక రాకెట్ బూస్టర్ మధ్యభాగం ఎస్-200ను అనుకున్న షెడ్యూల్ కన్నా ముందుగానే అందజేసింది. 3.2 మీటర్ల వ్యాసం, 8.5 మీటర్ల పొడవు. 5.5 టన్నుల బరువు ఉన్న ఈ బూస్టర్‌ను మానవసహిత ప్రయోగంలో ఉపయోగించనున్నారు.













