జీ20 భేటీకి భారీగా ఏర్పాట్లు
వచ్చే నెలలో జరిగే జీ20 సదస్సుకు ఆతిధ్యం ఇచ్చేందుకు దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబవుతోంది. అతిధులు, ప్రతినిధుల కోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులకు బస కోసం ఢిల్లీలోని హోటళ్లను బుక్ చేశారు. ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలోని 30కి పైగా హోటళ్లలో పలు దేశాధినేతలు, ప్రతినిధులకు రూంలను బుక్ చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఐటీసీ మౌర్య షెరటాన్లో బస చేస్తుండగా, తాజ్ ప్యాలెస్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆతిథ్యం అందుకోనున్నారు. ఢిల్లీలో 23 హోటళ్లు, ఎన్సీఆర్లో 9 హోటళ్లు జీ20 ప్రతినిధులకు ఆతిధ్యం ఇవ్వనున్నాయి.













