‘ధేకో అప్నా దేశ్’తో పర్యాటక రంగానికి ఊతం
దేశంలో టూరిజం రంగాన్ని ‘ధేకో అప్నా దేశ్’ కార్యక్రమం ద్వారా బలోపేతం చేస్తున్నట్లు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. దేశంలోని కనీసం 15 పర్యాటక ప్రదేశాలను సందర్శించాలని ప్రజలను కోరుతూ, ఈ కార్యక్రమం ద్వారా కోరుతున్నామని, జనవరి 1 నుంచి టీకాలు వేయడం పూర్తయితే, కేంద్రం అధికారికంగా విదేశీ పర్యాటకులను కూడా ఆహ్వానిస్తుందని చెప్పారు. తెలుగు రాష్ట్రాలలో కూడా పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తానని కూడా కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలోని గోల్కొండ కోట అభివ•ద్ధి, నిర్వహణ కోసం జిఎంఆర్ గ్రూపుతో తమ మంత్రిత్వ శాఖ చర్చలు జరుపుతోందని వెల్లడిస్తూ, సిఎస్ఐ చొరవ కింద ఎఎస్ఐ సైట్ల అభివ•ద్ధి మరియు పరిరక్షణ కోసం కేంద్రం పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య నమూనాను కూడా అవలంబిస్తామని చెప్పారు.
టూరిజం కేవలం ఆకర్షణీయమైన గమ్యస్థానాలు, విశ్రాంతి కార్యకలాపాలకు సంబంధించినది కాదని, ఆర్థికాభివృద్ధికి మూలస్తంభాలలో ఒకటిగా నిలిచిందని, అన్ని రంగాలలో అత్యధిక ఉద్యోగాలు సృష్టించే అవకాశాలను కలిగి ఉందని కిషన్‌రెడ్డి అన్నారు. రూ. 10 లక్షల పెట్టుబడికి, ఉత్పాదక రంగంలో 45 ఉద్యోగాలతో పోలిస్తే టూరిజం 78 ఉద్యోగాలను అందిస్తుందని పేర్కొంటూ టూరిజం ప్రాంతాల అభివృద్ధికి కేంద్రంలోని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. పర్యాటక పరిశ్రమ ఒక దేశంపై ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపుతుందని, ఇది ఒక భారీ వ•ద్ధి ఇంజిన్‌గా కూడా పనిచేయడమే కాకుండా దేశాభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. కోవిడ్ 19 మహమ్మారి దాడి పర్యాటక పరిశ్రమపై అపూర్వమైన సవాళ్లను విసిరిందని, అందువల్ల ట్రావెల్, టూరిజం మరియు ఆతిథ్య రంగాన్ని ఆవిష్కరించడం అభివృద్ధిలోకి తీసుకురావడం అవవసరం అని ఆయన అన్నారు.
దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి 2022 నాటికి భారతదేశంలోని 15 గమ్యస్థానాలను సందర్శించాలని పిఎం మోడీ కోరారు. ఇది మన దేశంలో పర్యాటక రంగాన్ని అభివ•ద్ధి చేస్తుందని అంటూ, పర్యాటకాన్ని పెంపొందించడానికి పెట్టుబడులను ప్రోత్సహించడానికి పర్యాటక మంత్రిత్వశాఖ తీసుకున్న అనేక చర్యలను జాబితా చేస్తూ, ఈ రంగాన్ని తిరిగి శక్తివంతం చేయడానికి మరియు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి మంత్రిత్వశాఖ నిపుణులు వాటాదారులతో నిరంతరం ఇంటరాక్ట్ అవుతోందన్నారు.
ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కృషి
ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి జి. కిషన్‌రెడ్డి తెలిపారు. మూడుశాఖల నిర్వహణ ఓ ఛాలెంజ్ అని ఆయన పేర్కొన్నారు. పెట్టుబడులు, ఉపాధి కల్పనకు అన్ని చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఆ రాష్ట్రాల్లో అభివృద్ధి, పనుల పురోగతిపై ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలిపారు. కాగా ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధాని మోదీ హయాంలో ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని ఆటంకాలన్నీ తొలగిపోయాయని, మరింత మెరుగుపర్చేందుకు తనవంతు బాధ్యతను నిర్వర్తిస్తానని చెప్పారు.
భారీ భవంతులు వద్దు..
మాస్ టూరిజం కారణంగా ఫైవ్ స్టార్ హోటళ్లు, భారీ భవంతులు నిర్మించడంతో లేహ్-లద్ధాఖ్ వంటి పర్యాటక ప్రాంతాల్లో జీవావరణ పరిస్థితులు దెబ్బతింటాయని కేంద్ర టూరిజం శాఖ డైరెక్టర్ జనరల్ గంజి కమలవర్ధనరావు అభిప్రాయపడ్డారు. లేహ్, కార్గిల్, నుమ్రా లోయ, లద్ధాఖ్‌లలో మాస్ టూరిజంతో జీవావరణ సమస్యలు తలెత్తకుండానే అభివృద్ధి సాధ్యమయ్యేలా పరిష్కారాలు కనుగొనాలన్నారు. కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో లేహ్‌లో ‘లద్ధాఖ్: నూతన ప్రారంభం, కొత్త లక్ష్యాలు’ పేరిట జరుగుతున్న మెగా టూరిజం ఈవెంట్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. లేహ్-లద్ధాఖ్ వంటి ప్రాంతాల్లో పర్యాటక రంగాన్ని వృద్ధి చేస్తూనే మాస్ టూరిజంను కట్టడి చేయాలన్నారు. ఆధునిక హోటళ్ల కోసం కాంక్రీట్ భవనాలు నిర్మించే కన్నా స్థానికుల ఇళ్లలో పర్యాటకులు బస చేస్తే స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. పర్యాటకులకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఫైవ్‌స్టార్ హోటల్ స్థాయిలో ఆహారం, ఆతిథ్యం అందించేలా భాషా, తదితరాల్లో స్థానికులకు పర్యాటకశాఖ శిక్షణ ఇస్తోందన్నారు.
లేహ్-లద్ధాఖ్ వంటి ప్రాంతాల్లో ఎయిర్‌పోర్టుల కంటే ఎక్కువగా హెలిప్యాడ్ల నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. యూరప్‌లోని ఆల్పస్ పర్వతాల్లో 10వేలకుపైగా ప్రాంతాల్లో స్కీయింగ్ క్రీడా వేదికలున్నాయని, దాంతో కోట్లాది మంది పర్యాటకుల రద్దీ కారణంగా మంచు కరిగి, ఉష్ణోగ్రతలు పెరగడం వంటి జీవావరణ మార్పులు కొనసాగుతున్నాయని చెప్పారు. భారత్‌లోనూ ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా చూడాలన్నారు. కులూ మనాలీ, ఊటీ, మున్నార్ వంటి పర్యాటక ప్రాంతాల్లో 20 ఏళ్లలో వాతావరణ పరిస్థితులు చాలా మారాయన్నారు. లేహ్‌లోని వందలాది ట్యాక్సీల్లో చాలావరకు 10ఏళ్ల పాతవని, కఠిన ఉద్గారాల కట్టడిపై పటిష్టమైన విజన్ డాక్యుమెంట్ అవసరమన్నారు.
కోలుకుంటున్న పర్యాటక రంగం
కోవిడ్ కారణంగా పర్యాటకరంగం కుదేలైందని, అయితే గత రెండునెలలుగా దేశీయ పర్యాటకం మెరుగుపడుతుండటం కాస్త ఊరటనిచ్చే అంశమని కమలవర్ధనరావు వ్యాఖ్యానించారు. ఇప్పటికే సుమారు 1.2కోట్ల మంది విదేశీ పర్యాటకులు భారత్‌కు వచ్చారని, అభయారణ్యాలు, తీరప్రాంతాలు, పుణ్యక్షేత్రాల్లో సందడి కనిపిస్తోందని తెలిపారు. హిమాలయ పర్వత శ్రేణుల్లో పర్యాటకం అభివ•ద్ధిపై శ్రద్ధవహించాలన్నారు. చారిత్రక కట్టడాల పరిరక్షణ, గ్రామీణ పర్యాటక రంగాన్ని ఏవిధంగా అభివృద్ధి చేయాలన్న అంశంపై రాష్ట్రాలు, పర్యాటకశాఖ ద•ష్టిసారించాలని కమలవర్ధన రావు సూచించారు. ఈ రంగం వృద్ధి కోసం మీడియాలో ప్రచారం కల్పించడంతో పాటు ప్రజల్లో అవగాహన మరింత పెంచాలన్నారు. సినిమా టూరిజంను పెంచేందుకు ప్రణాళికలు సిద్ధంచేశామన్నారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి కశ్మీర్, లేహ్-లద్ధాఖ్, ఈశాన్య రాష్ట్రాలకు పర్యాటకుల తాకిడి పెరుగుతోందని పేర్కొన్నారు.
స్థానిక భాగస్వామ్యం ఎంతో కీలకం
40 ఏళ్లలో లద్దాఖ్‌లో పర్యాటక రంగం గణనీయమైన అభివ•ద్ధి సాధించిందని కిషన్‌రెడ్డి అన్నారు. ట్రెక్కర్లు, బైకర్లు, సైక్లిస్టులు, అధిరోహకులు మొదలైన వారికి లద్ధాఖ్ ఒక మంచి అనుభూతిని ఇస్తుందన్నారు. మెగా టూరిజం ఈవెంట్లో కిషన్‌రెడ్డి వర్చువల్ వేదికగా పాల్గొని ప్రసంగించారు. ‘లద్దాఖ్ అభివృద్ధికి దేశంలోని వేరే రాష్ట్రాల టూర్ ఆపరేటర్లు, స్థానికులతో చర్చలు జరిపేందుకు ఈవెంట్ మంచి వేదిక’ అని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. టూరిస్ట్ వాటర్ స్క్రీన్ ప్రొజెక్షన్ మల్టీమీడియాషోతో పాటు ఇతర పర్యాటక ఆకర్షణలకోసం కేంద్ర ప్రభుత్వం రూ.23.21 కోట్లను లద్దాఖ్‌కు అందించిందన్నారు. ఈవెంట్లో లద్దాఖ్ టూరిజం సౌకర్యాలు, ఉత్పత్తుల ఎగ్జిబిషన్, చర్చా గోష్టిలు జరుగుతున్నాయి. ఈ రంగంలోని నిపుణులు, టూర్ ఆపరేటర్లు, హోటల్ యజమాన్యాలు, దౌత్యవేత్తలు, ‘హోం స్టే’ యజమానులు సహా 150 మంది ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
జన ఆశీర్వాద యాత్ర విజయవంతం
కేంద్రం అమలు చేస్తున్న కార్యక్రమాలు వివరిస్తూనే.. జనం ఆశీర్వాదం తీసుకునేందుకు కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి చేపట్టిన జన ఆశీర్వాద యాత్ర విజయవంతమైంది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ యాత్రను చేశారు. కేంద్రంలో బీజేపీ పాలన ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ యాత్ర చేశారు. యాత్ర పొడవునా బీజేపీ ప్రభుత్వ విజయాలు, సంక్షేమ కార్యక్రమాలను కిషన్ రెడ్డి వివరిస్తూ ప్రజల అభిమానాన్ని అందుకున్నారు. తిరుపతి, తిరుమల, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గాల్లోనూ, అక్కడి దేవాలయాల్లోను స్వామివార్లను దర్శించుకుని ఆయన ఈ యాత్ర చేశారు. అలాగే తెలంగాణలో కోదాడ, సూర్యాపేట, దంతాలపల్లి, తొర్రూరు, రాయపర్తి, వర్ధన్నపేట మీదుగా వరంగల్‌కు వచ్చిన కిషన్‌రెడ్డి అక్కడి భద్రకాళిమాతను దర్శనం చేసుకుని వరంగల్, హన్మకొండలో తెలంగాణ అమరవీరు లకు శ్రద్ధాంజలి ఘటిస్తారు. వరంగల్‌లో టీకా కేంద్రాన్ని కూడా పరిశీలిస్తారు. ఆ తర్వాత సర్వాయి పాపన్న గ్రామమైన ఖిలాషాపూర్.. అక్కడి నుంచి జనగామ, ఆలేరుకు చేరుకుం టారు. యాదాద్రి చేరుకుని లక్ష్మీ నరసింహ స్వామిని దర్శనం చేసుకున్న ఆయన తర్వాత ఘట్కేసర్, ఉప్పల్ మీదుగా నాంపల్లిలో పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. చివరిగా అంబర్‌పేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ముగింపు సభలో మాట్లాడారు. అంబర్‌పేటలో జరిగిన జన ఆశీర్వాద సభలో తాను ఇప్పుడు ఢిల్లీలో ఉన్నానంటే అంబర్‌పేట అసెంబ్లీ, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలే కారణమని అంటూ, తనకు కేంద్రమంత్రి అయినందుకు సంతోషం లేదని.. అంబర్‌పేటకు దూరమయ్యానన్న బాధే ఎక్కువగా ఉందని చెబుతూ, అంబర్‌పేటతో తనకు ఉన్న సంబంధాన్ని మరోమారు ప్రజలకు తెలియ జేశారు. ఈ ఆశీర్వాదయాత్రలో బిజెపికి ఆదరణ పెంచడానికి కృషి చేశారు.
తెలంగాణలో పర్యాటకశాఖ అభివృద్ధికి చర్యలు
దేశంలో పర్యాటక శాఖ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని కిషన్‌రెడ్డి చెప్పారు. జనవరి నుంచి పర్యాటక రంగాన్ని పునఃప్రారంభించాలని అనుకుంటున్నామన్నారు. తెలుగు ప్రజల ఆశీస్సులతోనే కేంద్రమంత్రి అయ్యానని తెలిపారు. తనపై ప్రధాని మోదీ కీలక బాధ్యతలు పెట్టారని చెప్పారు. కరోనా కారణంగా రెండేళ్లుగా పర్యాటకం దెబ్బతిందని వివరించారు. దేశంలో పర్యాటకశాఖను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. యునెస్కో గుర్తించిన 40 కేంద్రాలు దేశంలో ఉన్నాయని వాటిల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని కిషన్‌రెడ్డి తెలిపారు. బతుకమ్మ, బోనాల, వినాయకచవితి, మేడారం జాతరలను చిత్రించి దేశ వ్యాప్తంగా చూపించబోతున్నాం. తెలంగాణతోపాటు ఇతర రాష్ట్ర పండుగలను గుర్తిస్తాం. భువనగిరి కోటకు ప్రత్యేకత ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. భద్రాచలం, వేములవాడ ఆలయాలను అభివ•ద్ధి చేయాల్సిన అవసరం ఉంది. గత పాలకులు ఈ ఆలయాల అభివ•ద్ధిని పట్టించుకోలేదని కిషన్‌రెడ్డి అన్నారు. బతుకమ్మ, గిరిజన పండగలు, సమ్మక్క-సారక్క జాతరలను వచ్చే రెండేళ్లలో టూరిజం స్పాట్లుగా చేయనున్నట్లు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి భువనగిరి కోటను అభివ•ద్ధి చేస్తామని చెప్పారు.













