లండన్ పర్యనటకు వెళ్లిన మాజీ ఉపరాష్ట్రపతి
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆరు రోజుల పర్యటన నిమిత్తం లండన్ బయలుదేరారు. అక్కడ చదువుతున్న తన మనుమరాలు వైష్టవి స్నాతకోత్సవ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంటారు. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని పురస్కరించుకొని ఈ నెల 29న తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ వారు నిర్వహించే తెలుగు భాషా దినోత్సవంలో ప్రసంగిస్తారు. 31న లండన్లోని గురుహరి సంత్ భగవంత్ సాహెబ్ వారి అనూపమ్ మిషన్ ఆధ్వర్యంలో ఓం క్రిమిటేరియం పేరిట 12 ఏకరాల్లో నిర్మిస్తున్న అదిపెద్ద హిందూ మహాప్రస్తానానికి శంకు స్థాపన చేస్తారు. సెప్టెంబరు 1న భారత సంతతి ప్రజలు ఏర్పాటు చేయనున్న ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారు.













