ఆడ్వాణీకి వెంకయ్య నాయుడు అభినందనలు
దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నకు ఎంపికయిన బీజేపీ అగ్రనేత ఎల్కే ఆడ్వాణీకి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభినందనలు తెలిపారు. చాలా రోజుల తర్వాత ఢిల్లీకి వచ్చిన వెంకయ్య ఢిల్లీలోని ఆడ్వాణీ నివాసానికి వెళ్లి పుష్పగుచ్ఛం అందించారు. నేను నా మార్గదర్శిని కలిశాను. మా తరానికి చెందిన ఒకానొక గొప్పనేత, రాజనీతిజ్ఞుడు, ఆధునిక భారత నిజమైన రత్నం అని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. మరోవైపు త్యాగరాజమార్గ్లోని వెంకయ్య నాయుడి నివాసానికి ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ విచ్చేసి పద్మవిభూషణ్‌కు ఎంపికయినందుకు ఆయనకు అభినందనలు తెలిపారు. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కూడా వెంకయ్యను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.













