గుజరాత్లో హిల్లరీ క్లింటన్ పర్యటన
అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ గుజరాత్లో పర్యటించారు. ఆదివారం ప్రారంభమైన ఆమె పర్యటన మరో రెండు రోజుల పాటు కొనసాగనుంది. గాంధేయవాది సమాజిక కార్యకర్త ఇలా భట్ స్థాపించిన మహిళా స్వయం సహాయ సంఘం ( సేవా) 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అహ్మదాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఇలా భట్‌కు నివాళులర్పించడంతో పాటు సేవా సభ్యులతో ముచ్చటించారు. వాతావరణ మార్పుల వల్ల పెరుగుతున్న ఉష్ణోగ్రతలు అసంఘటిత రంగంలో ఉన్న మహిళలకు సవాలుగా నిలిచే ప్రమాదముందని ఆమె హెచ్చరించారు దీనిని ఎదుర్కోవడానికి కొంత మంది ఔత్సాహికులు కలిసి వాతావరణ మార్పుల నిధి (సీఆర్ఎఫ్)ని తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.













