టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ ఇక లేరు
టాటా సన్స్ మాజీ చైర్మన్ సరైస్ మిస్త్రీ మహారాష్ట్రలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. సైరస్ మిస్త్రీ అహ్మదాబాద్ నుంచి ముంబాయి తిరిగి వస్తుండగా, ఆయన ప్రయాణిస్తున్న మెర్సిడెస్ కారు రోడ్డు డివైడర్‌ను గట్టిగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సైరస్ మిస్త్రీ తీవ్ర గాయాలతో ప్రాణాలు విడిచారు. ఈ ఘటన పాల్ఘాట్ ప్రాంతంలోని చరోటీ వద్ద సూర్యా నది వంతెనకు సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌కు, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. వారిని గుజరాత్‌లోని ఒక ఆసుప్రతికి తరలించారు. సైరస్ మిస్త్రీ దుర్మరణం పట్ల వ్యాపార, రాజకీయ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమైంది.













