రాజస్థాన్ మాజీ సీఎం జగన్నాథ్ ఇకలేరు

కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా (89) కన్ను మూశారు. కరోనా బారినపడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పహాడియా 1980-81లో రాజస్థాన్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత బిహార్, హర్యానా గవర్నర్‍గా సేవలందించారు. జగన్నాథ్ పహాడియా మృతిపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణంతో షాక్‍కు గురయ్యానన్నారు. ఆయనకు మొదటి నుంచి నాకు చాలా అనుబంధం ఉందని పహాడియా మరణం తనకు వ్యక్తిగతంగా నష్టమని అశోక్ గెహ్లాట్ అన్నారు.