కేరళలో విషాదం..మాజీ మిస్ కేరళ ఇకలేరు
కేరళలో విషాదం చోటు చేసుకుంది. మాజీ మిస్ కేరళ అన్షీ కబీర్(25), రన్నరప్ అంజనా షాజన్ (26) ప్రమాదంలో దుర్మరణం చెందారు. కోచికి సమీపంలోని వైటిల్లా వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఓ ద్విచక్రవాహనాన్ని తప్పించే క్రమంలో పల్టీలు కొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జయింది. ఈ దుర్ఘటనలో డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. అయితే, ప్రమాదం సమయంలో కేవలం డ్రైవర్ మాత్రమే సీటు బెల్టు ధరించినట్లు పోలీసులు భావిస్తున్నారు. అన్సు కబీర్ది తిరువనంతపురం కాగా, అంజనా షాజ్ కోచికి చెందినవారు.













