కేంద్ర మాజీ హోం మంత్రి ఇక లేరు…
మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నేత బూటా సింగ్ కన్ను మూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. దళిత నేతగా బూటా సింగ్కు ప్రత్యేక గుర్తింపు ఉన్నది. 1986 నుంచి 1989 వరకు ఆయన రాజీవ్ గాంధీ క్యాబినెట్లో హోంశాఖ మంత్రిగా చేశారు. 1984 నుంచి 1986 వరకూ బూటా సింగ్.. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిగా కూడా చేశారు. 2004 నుంచి 2006 వరకు బీహార్ గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తించారు. బూటా సింగ్ మృతిపట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. నిజమైన ప్రజా సేవకుడిని కోల్పోయినట్లు తెలిపారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలతో బూటా సింగ్తో అత్యంత సాన్నిహిత్యం ఉన్నది. 1962లో ఆయన తొలిసారి లోక్సభకు ఎన్నికయ్యారు.
1978లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. 1970, 80 దశకాల్లో ఆయన ఖలిస్తాన్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆపరేషన్ బ్లూ స్టార్లో పాల్గొన్నారు. గోల్డెన్ టెంపులో పునర్ నిర్మాణంలో పాత్ర పోషించారు. 1982లో రాష్ట్రపతి పదవి కోసం బూటా సింగ్ పోటీపడ్డారు. కానీ ఆ రేసులో జ్ఞానీ బైల్ సింగ్ చేతిలో ఆయన ఓడిపోయారు. 2007 నుంచి 2010 వరకు షెడ్యూల్ కులా జాతీయ కమిషన్కు చైర్మన్గా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీతో విభేదాలు వచ్చిన ఆయన పార్టీని వీడియారు. మళ్లీ 2015లో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. పంజాబీ స్పీకింగ్ స్టేట్.. ఏ క్రికెట్ అనాలసిస్ అనే పుస్తకాన్ని రాశారు. ప్రధాని నరేంద్ర మోదీ బూటా సింగ్ మృతిపట్ల సంతాపం ప్రకటించారు.













