జస్టిస్ ఎన్వీ రమణకు అరుదైన గౌరవం
సింగపూర్ ఇంటర్నేషనల్ మీడియేషన్ సెంటర్ (సీఐఎంసీ) ప్యానల్ సభ్యుడిగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నియమితులయ్యారు. సింగపూర్ కన్వెన్షన్ వీక్లో పాల్గొనడానికి వెళ్లిన ఆయన సీఐఎంసీ చైర్మన్ జార్జి లిమ్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సభ్యుడిగా నియామక పత్రాన్ని అందుకున్నారు. అలాగే భారత్కు చెందిన నాలుగు ప్రముఖ కంపెనీలు టాటా, రిలయన్స్, మహీంద్రా, ఆదిత్య బిర్లా గ్రూప్లతోనూ జస్టిస్ రమణ సమావేశమయ్యారు. మీడియేషన్ను ప్రోత్సహించడంతో పాటు మద్దతు కూడగట్టేలా జస్టిస్ ఎన్వీ రమణ చొరవతో ప్రారంభించిన డిక్లరేషన్ ఆఫ్ ఇంటెంట్పై ఆయా ఎంఎన్సీలు సంతకాలు చేశాయి. జస్టిస్ రమణ న్యాయమూర్తిగా ఉన్న సమయంలో కూడా ప్రత్యామ్నాయ వివాద పరిష్కార మార్గాలను అమితంగా ప్రోత్సహించేవారనే సంగతి తెలిసిందే.













