టిక్‌టాక్‌కు మరో ఎదురుదెబ్బ
టిక్‌టాక్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థ తరుపున తాను కోర్టులో వాదించబోనని మాజీ అటర్నీ జనరల్ ముకుల్ రోహత్గి తెలిపారు. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా చైనా యాప్ తరుపున కోర్టుకు వెళ్లబోనని సృష్టం చేశారు. దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, భద్రత నేపథ్యంలో చైనాకు సంబంధించిన 59 యాప్‌లను భారత్ నిషేధించిన సంగతి తెలిసిందే. టిక్‌టాక్‌తో సహా లైకీ, యూసీ బ్రౌజర్, కామ్‌స్కానర్, విగొ వీడియో, వంటి పలు యాప్‌లు ఈ జాబితాలో ఉన్నాయి. తూర్పు లఢక్ సరిహద్దులో ఈ నెల 15న భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబుతో సహా 20 మంది భారత జవాన్లు అమరులైన నేపథ్యంలో భారత్ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకున్నది.













