ప్రధాని మోదీతో మధ్య ఆసియా దేశాల విదేశాంగ మంత్రుల భేటీ
మధ్య ఆసియా దేశాలైన కజఖ్‌స్థాన్, కిర్గిజ్ రిపబ్లిక్, తజికిస్థాన్, తుర్క్ మెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్ల విదేశాంగ మంత్రులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఢిల్లీలో సమావేశమయ్యారు. మధ్య ఆసియా దేశాలతో భారత్‌కు ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. భారతీయ సినిమాలు, సంగీతం, యోగా వంటి ఆ దేశాల్లో గణనీయమైన ఆరదణ ఉందని పేర్కొన్నారు. పరస్పరం సాంస్కృతిక, ప్రజా సంబంధాలను కొనసాగించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. భారత విదేశీ వ్వవహారాల శాఖ మంత్రి ఎస్. జైశకంర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ కూడా పాల్గొన్నారు.













