దేశ చరిత్రలో తొలిసారిగా.. ఆర్టిలరీ రెజిమెంట్ లోకి
దేశ చరిత్రలో ఆర్టిలరీ రెజిమెంట్‌లోకి సైన్యం తొలిసారిగా ఐదుగురు మహిళా అధికారులను తీసుకున్నది. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ లో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా అధికారులు ఆర్టిరీ రెజిమెంట్‌లో చేరారు. ఆర్టిలరీ రెజిమెంట్‌లో చేరిన మహిళా అధికారుల్లో లెఫ్టినెంట్ మెహక్ సైనీ, లెఫ్టినెంట్ సాక్షి దూబే, లెఫ్టినెంట్ అదితి యాదవ్, లెప్టినెంట్ పవిత్రా మౌద్గిల్ ఉన్నారని అధికారులు తెలిపారు. ఐదుగురు మహిళా అధికారుల్లో ముగ్గురని చైనా సరిహద్దు వెంబడి మోహరించిన యూనిట్లలో, మిగతా ఇద్దరిని పాక్ సరిహద్దుకు సమీపంలో సవాల్‌తో కూడుకున్న ప్రదేశాల్లో నియమించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.













