బెంగాల్ పోలింగ్‌లో కాల్పులు… నలుగురు మృతి
పశ్చిమ బెంగాల్ నాలుగో విడత పోలింగ్‌లో హింస చోటుచేసుకుంది. కూచ్‌బెహార్ జిల్లాలో తృణమూల్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణ కాస్త కాల్పుల దాకా వెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. తృణమూల్, బీజేపీ కార్యకర్తలు పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణకు దిగారు. బాంబులు కూడా విసురుకున్నారు. దీంతో సీఆర్పీఎఫ్ బలగాలు అక్కడికి చేరుకొని, కార్యకర్తలపై లాఠీఛార్జీ చేశాయి. అయినప్పటికీ పరిస్థితి సద్దుమణగకపోవడంతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు చనిపోయారు. ఈ హత్యపై అధికార తృణమూల్, ప్రతిపక్ష బీజేపీ మధ్య ఆరోపణలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటన వెనుక బీజేపీ హస్తం ఉందని తృణమూల్ ఈరోపించింది. అయితే తృణమూలే ఈ ఘటనకు కారణమని బీజేపీ ఆరోపించింది. కూచ్‌బెహార్‌లోని సీతలకుచిలో గల ఓ పోలింగ్ కేంద్రం ఎదుట గుర్తుతెలియని వ్యక్తులు దాడులకు పాల్పడ్డారు. ఓ యువ ఓటరుపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ ఓటరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
స్పందించిన ప్రధాని మోదీ
నాలుగో విడత పోలింగ్ సందర్భంగా కూచ్బెహార్ల కాల్పులు చోటుచేసుకొని ఐదుగురు మృతి చెందడంపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. కూచ్బెహార్ల ఈ ఉదయం జరిగిన ఘటన చాలా బాధాకరమని వ్యాఖ్యానించారు. పోలింగ్ సందర్భంగా చోటు చేసుకున్న కాల్పుల్లో ఐదుగురు మృతి చెందడం కలచివేసిందన్నారు. వారి మృతికి సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మోదీ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈసీకి లేఖ రాసిన తృణమూల్ ఎంపీ
కూచ్‌బెహర్‌లో కాల్పుల ఘటనపై ఎన్నికల కమిషన్‌కు తృణమూల్ ఎంపీ డెరిక్ ఓ బ్రెయిన్ ఫిర్యాదు చేశారు. ఓ పార్టీ సిద్ధాంతాలను విశ్వసించే ఐదుగురు కార్యకర్తలను సీఆర్పీఎఫ్ కాల్చిచంపిందని ఈమెయిల్ ద్వారా ఈసీకి ఫిర్యాదు చేశారు. బీజేపీ ఓ బూత్‌ను తమ గుప్పిట్లోకి తీసుకున్న తర్వాత, టీఎంసీ ఏజెంట్లను లోపలకు రానీయకుండా కాల్పులు జరపడంతో ఐదుగురు వ్యక్తులు మరణించారని డెరిక్ ఓ బ్రెయిన్ ఆరోపించారు.













