ఫేస్బుక్ పై కేందప్రభుత్వం నిఘా!
ఫేస్బుక్ వినియోగదారుల వివరాలు కోరుతూ భారత ప్రభుత్వం నుంచి గతేడాది రెండో అర్ధభాగంలో 40,300 అభ్యర్థనలు వచ్చాయని ఫేస్బుక్ సంస్థ వెల్లడించింది. ఇందులో 37,865 అభ్యర్థనలు చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడానికి అవసరమైన సమాచారానికి సంబంధించినవని తెలిపింది. ఈ మేరకు ట్రాన్స్పరెన్సీ రిపోర్టులో వివరాలు వెల్లడించింది. గతేడాదే తొలి ఆరునెలల్లో 35,560 అభ్యర్థనలు వచ్చాయని పేర్కొన్నది. అంటే భారత ప్రభుత్వం నుంచి ఏడాదిలో 76 వేల అభ్యర్థనలు వెళ్లాయన్న మాట. అత్యధికంగా అమెరికా నుంచి గతేడాది రెండో అర్ధభాగంలో 61,262 అభ్యర్ధనలు వచ్చినట్టు, భారత్ రెండో స్థానంలో ఉన్నట్లు తెలిపింది.













