ఫేస్బుక్ చీఫ్ ను ప్రశ్నించిన పార్లమెంటరీ కమిటీ
ఫేస్బుక్ రాజకీయ పక్షపాతం చూపుతోందటూ విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఆ సంస్థ భారత్ అధినేత అజిత్ మోహన్ పార్లమెంటరీ కమిటీ ముందు హాజరయ్యారు. ఎంపీ శశిథరూర్ నేతృత్వంలోని కమిటి దాదాపు రెండు గంటలకుపైగా అజిత్‌ను ప్రశ్నించింది. పౌరుల హక్కులను పరిరక్షించడం, ఆన్లైన్ మీడియో ప్లాట్‌ఫాంల దుర్వినియోగాన్ని నిరోధించడం, డిజిటల్ ప్రపంచంలో మహిళలకు ప్రత్యేక భద్రత కల్పించడం వంటి వాటిపై అభిప్రాయాలు సేకరించినట్లు తెలిసింది. అయితే కమిటీ, పునర్నిర్మించాలనే కారణంతో సభ్యుల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో ఈ నెల 10న ఫేస్బుక్ ప్రతినిధులతో మరోమారు సమావేశమవ్వాలని నిర్ణయించినట్లు సమచారం.













