మరో వివాదంలో చిక్కుకున్న ఫేస్‍బుక్

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‍బుక్ ఓ వివాదంలో చిక్కుకుంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని రాజీనామా చేయాలంటూ సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు హాష్ ట్యాగ్ ను వైరల్ చేస్తున్నారు. అలాంటి హాష్ ట్యాగ్ లన్నింటినీ ఫేస్ బుక్ తాత్కాలికంగా బ్లాక్ చేసింది. దానిపై విమర్శలు రావడంతో ఫేస్ బుక్ స్పందించింది. పొరపాటున జరిగిందంటూ ప్రకటించింది. ఆ హాష్ ట్యాగ్ లతో కూడిన పోస్టులను బ్లాక్ చేయాలంటూ భారత ప్రభుత్వం తమనేమీ అడగలేదని స్పష్టం చేసింది. కొన్ని పోస్టులు తమ కమ్యూనిటీ ప్రమాణాలకు లోబడి లేవని, అ•దుకే వాటిని బ్లాక్ చేశామని తెలిపింది. అయితే కేవలం భారత్‍లో మాత్రవే వాటిని నిషేధించింది. దాదాపు 3 గంటల పాటు ఆ పోస్టులను బ్లాక్ చేసింది. ఆ తర్వాత పోస్టులను పునరుద్ధరించింది. అయితే బ్లాక్ చేసిన ఆ కొద్ది సేపూ విదేశాల్లో ఆ పోస్టులు యథావిధిగా కనిపించాయి.