మనీశ్ సిసోడియాకు మరోసారి షాక్
ఢిల్లీ మద్యం పాలసీ కేసు లో మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీశ్ సిసోడియా జుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. మధ్యం పాలసీ, మనీలాండరింగ్ కేసులో సీబీఐ, ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో జూడీషియల్ కస్టడీలో ఉన్నారు. కాగా, కోర్టు ఆయనకు విధించిన కస్టడీ నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో సిసోడియాను పోలీసులు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. లిక్కర్ స్కాంలో సీబీఐ, ఈడీ వేర్వేరు కేసులతో దర్యాప్తు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీబీఐ కేసులో సిసోడియా కస్టడీని ఏప్రిల్ 27వ తేదీకి, ఈడీ కేసులో ఏప్రిల్ 29వ తేదీ దాకా కస్టడీని పొడిగిస్తున్నట్లు న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.













