ఆప్ సంచలన ఆరోపణలు.. నవంబరు 2న కేజ్రీవాల్ ను!
మద్యం కుంభకోణం కేసు లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సమన్లు జారీ అయిన విషయం తెలిసిందే. నవంబరు 2న ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరుకానున్నారు. అయితే ఆ సమయంలో కేజ్రీవాల్‌ను అరెస్టు చేసే అవకాశాలున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు మంత్రి అతిషీ మీడియాతో మాట్లాడుతూ కేజ్రీవాల్ అరెస్టుపై అనుమానాలు వ్యక్తం చేశారు. నవంబరు 2న కేజ్రీవాల్‌ను అరెస్టు చేసే అవకాశాలున్నాయని సమాచారం అందింది. ఒకవేళ ఆయన అరెస్టయితే అవినీతి ఆరోపణలపై మాత్రం కాదు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆప్ రెండు సార్లు ఓడిరచింది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఆప్ చేతిలో ఆ పార్టీ ఓటమిపాలైంది. కేజ్రీవాల్‌ను చూసి ప్రధాని మోదీ భయపడుతున్నారు. ఎన్నికల్లో కేజ్రీవాల్‌ను ఓడిరచలేమని బీజేపీకి అర్థమైంది. అందుకే ఇలా తప్పుడు కేసులు పెడుతోంది అని ఆరోపించారు.













