బీజేపీకి మాజీ మంత్రి షాక్ !
గుజరాత్ శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవడంతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఈ ఎన్నికల ముందు అధికార భారతీయ జనతా పార్టీ కి మాజీ మంత్రి ఒకరు షాకిచ్చారు. మాజీ మంత్రి జయనారాయణ్ వ్యాస్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. తన రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్‌కు పంపించారు. గత మూడు దశాబ్దాలుగా బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా పార్టీకి నేను సేవ చేశారు. ఈ రోజు వ్యక్తిగత కారణాలతో పార్టీకీ రాజీనామా చేస్తున్నా అని వ్యాస్ రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
75 ఏళ్ల వ్యాస్ ఇటీవల కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, కాంగ్రెస్ గుజరాత్ ఎన్నికల పరిశీలకులతో వరుసగా సమావేశమయ్యారు. దీంతో ఆయన హస్తం పార్టీలో చేరే అవకాశముందని ప్రచారం జోరందుకుంది. అయితే వ్యాస్ తన భవిష్యత్ కార్యాచరణపై ఎలాంటి ప్రకటనా చేయలేదు.













