బిహార్ ప్రజలకు శుభవార్త చెప్పిన కేంద్రం.. “జన్ నాయక్”కు భారతరత్న!
బిహార్ మాజీ సీఎం, దివంగత కర్పూరి ఠాకూర్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న అందిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయన శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఈ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించారు. 1924 జనవరి 24న ఠాకూర్ జన్మించారు. బుధవారం నాడు ఆయన శతజయంతి వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా బీహార్ ప్రజలకు కేంద్రం ఈ శుభవార్త అందించింది. కర్పూరి ఠాకూర్ 1988 ఫిబ్రవరి 17న కన్నుమూశారు. తన రాజకీయ జీవితంలో ఆయన రెండుసార్లు బీహార్ సీఎంగా పని చేశారు. 1970 నుంచి 1971 వరకు మొదటిసారి, 1977 నుంచి 1979 వరకు రెండోసారి ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయన పాలనను ఎంతో మెచ్చుకునే బిహారీలు ఆయన్ను “జన్ నాయక్” అని పిలుచుకుంటారు.













