నవంబర్ 7 నుంచి 30 వరకు నిషేధం : ఈసీ
ఎగ్జిట్ పోల్స్, ప్రి పోల్స్ సర్వేలపై ఈసీ నిషేధం విధించింది. తెలంగాణతో పాటు శాసనసభ ఎన్నికలు జరగనున్న మరో నాలుగు రాష్ట్రాలలో ఎగ్జిట్‌పోల్స్‌పై నిషేధం విధిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాలలో ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని పేర్కొంది. నవంబర్ 7 నుంచి ఎన్నికలు జరగనున్న 30వ తేదీ సాయంత్రం 6:30 గంటల వరకు నిషేధం అమలులో ఉంటుందని పేర్కొంది. ఈ ఆజ్ఞలను ఉల్లంఘించిన వారిపై సెక్షన్ 126 ప్రజాప్రాతినిధ్యం చట్టం 1951 మేరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.













