ఎగ్జిట్‌పోల్స్ ప్రకటనపై ఈసీ కీలక నోటిఫికేషన్
దేశంలో 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల నిర్వహణ కోసం జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే 7 దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం తొలి దశ ఎన్నికలు మరి కొద్దిరోజుల్లో జరగనున్న నేపథ్యంలో ఈసీ మరో కీలక ప్రకటన చేసింది. ఈ ప్రకటనలో ఎగ్జిట్ పోల్స్ విడుదలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం.. దేశంలో ఏప్రిల్ 19 నుంచి సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత ఏప్రిల్ 25న రెండో దశ, మే 7న మూడో దశ, మే 13న నాలుగో దశ, మే 20న ఐదో దశ, మే 26న ఆరో దశ, జూన్ 1న ఏడో దశ ఎన్నికలు జరగనుండగా.. జూన్ 4వ తేదీన ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల నోటిఫికేషన్ ఎగ్జిట్ పోల్స్‌కు సంబంధించిన ప్రకటన వెలువడింది.
ఈసీ ప్రకటన ప్రకారం.. ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగిసేవరకూ అంటే ప్రారంభ దశ ఏప్రిల్ 19 ఉదయం 7 గంటల నుంచి చివరి దశ పోలింగ్ జరగాల్సిన జూన్ 1న సాయంత్రం 6.30 గంటల వరకు ఎలాంటి ఎగ్జిట్ పోల్ట్ నిర్వహించడం లేదా ప్రసారం చేయడం లేదా ప్రచురించడాన్ని ఎన్నికల సంఘం నిషేధించింది. ఇదిలా ఉంటే సాధారణంగా మీడియా సంస్థలు, సర్వే సంస్థలు ఎన్నికల రోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ ప్రకటిస్తుంటాయి. కానీ ఎన్నికల సంఘం ఈ ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధించడంతో ఇక జూన్ 1 సాయంత్రం వరకూ సర్వే, మీడియా సంస్థలు ఏ విధమైన సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ప్రకటించడానికి వీల్లేకుండా పోయింది. అయితే 7వ దశ పోలింగ్ తర్వాత అన్ని మీడియా సంస్థలు తమ తమ ఎగ్జిట్ పోల్స్ వివరాలను ప్రకటించవచ్చు.













