తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు …
దేశంలో మరోసారి ఎన్నికల సందడి మొదలైంది. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల నగరా మోగింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాలకు శాసనసభ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఐదు రాష్ట్రాల్లోని మొత్తం 679 నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ఈసీ తెలిపింది. తెలంగాణలో 3.17 కోట్లు, రాజస్థాన్లో 5.25 కోట్లు, మధ్యప్రదేశ్లో 5.6 కోట్లు, ఛత్తీస్గఢ్లో 2.03 కోట్లు, మిజోరంలో 8.52 లక్షల ఓటర్లున్నారు.
తెలంగాణ ఎన్నికల తేదీలు :
నోటిఫికేషన్ తేదీ: నవంబరు 3
నామినేషన్ ల సమర్పణకు చివరి తేదీ: నవంబర్ 10
నామినేషన్ ల పరిశీలన తేదీ : నవంబరు 13
నామినేషన్ ల ఉపసంహరణకు చివరి తేదీ : నవంబరు 15
పోలింగ్ తేదీ : నవంబరు 30
ఓట్ల లెక్కింపు తేదీ : డిసెంబరు 3
ఏ రాష్ట్రంలో ఎప్పుడంటే …
తెలంగాణలో నవంబర్ 30న, రాజస్థాన్లో నవంబర్ 23న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఛత్తీస్గఢ్లో రెండ విడతల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 7న మొదటి విడత, నవంబర్ 17న రెండో విడతలో పోలింగ్ నిర్వహిస్తారు. మధ్యప్రదేశ్లో నవంబర్ 17న పోలింగ్ జరగగా, మిజోరాంలో నవంబర్ 7న ఒకే విడుతలో ఎన్నికలు జరగనున్నాయి. ఐదు రాష్ట్రాలకు డిసెంబర్ 3న కౌంటింగ్ జరగనుంది. తెలంగాణలో మొత్తం 119 నియోజకవర్గాలుండగా మధ్యప్రదేశ్లో 230, రాజస్థాన్ లో 200, ఛత్తీస్గఢ్లో 90, మిజోరం లో 40 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయని ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు.













