రాజ్యసభ ఉప ఎన్నికలకు షెడ్యూల్ ఖరారు
ఆరు రాష్ట్రాల్లో రాజ్యసభ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఖరారు చేసింది. నోటిఫికేషన్ను విడుదల చేసింది. అక్టోబర్ 4న ఆరు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. బెంగాల్, అసోం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో ఒక్కో రాజ్యసభ స్థానానికి, తమిళనాడులో రెండు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. నామినేషన్ల పక్రియ ఈ నెల 15న ప్రారంభమై 22వ తేదీ వరకు కొనసాగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ సెప్టెంబర్ 27. అక్టోబర్ 4వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ పక్రియ జరగనుంది. అనంతరం ఓట్లను లెక్కించనున్నారు. కాగా రాజ్యసభ ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకొనున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర అసెంబ్లీలోనే ఓటింగ్ జరుగుతుంది. దీనికి సంబంధించి కట్టుదిట్టమైన భద్రతతో పాటు కరోనా మార్గదర్శకాల మధ్య ఉప ఎన్నికలు నిర్వహించనుంది.













