ఈజిప్టు అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ
భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్`సిసి భారత్కు చేరుకున్న సంగతి తెలిసిందే. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీకి చేరుకున్న ఆయన తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేలా వ్యవసాయం, డిజిటల్ డొమైన్, వాణిజ్యంతో సహా వివిధ రంగాలపై విసృతస్థాయిలో చర్చలు జరిపారు. ఆసియా, ఆఫ్రికా మధ్య వారధిగా ఉండే ఈజిప్టుతో తమ సంబంధాలు మరింత మెరుగుతున్నాయి. ప్రాచీన, సాంస్కృతి, ఆర్థికపరమైన సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఈజిప్టు అధ్యక్షుడు జరిపిన విస్తృత చర్చలు ఎంతో దోహదం చేస్తాయి అని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్ బాగ్చి వెల్లడించారు.













