తమిళనాడు ఎఐడిఎంకె సిఎం అభ్యర్ధిగా పళనిస్వామి
తమిళనాడులో వచ్ఛే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు పాలక అన్నా డీఎంకే అప్పుడే కసరత్తు ప్రారంభించింది. దీనిలో భాగంగా నేడు చెన్నై పార్టీ హైలెవల్ కమిటీ సమావేశం నిర్వహించారు..ఈ సమావేశంలో ఆ పార్టీ సీనియర్ నేత, డిప్యూటీ సిఎం పన్నీర్ సెల్వం మాట్లాడుతూ, వచే ఎన్నికలలో పళనీ స్వామి నేతృత్వంలో బరిలోకి దిగుతామని ప్రకటించారు.. ఆయన తమ పార్టీ సిఎం అభ్యర్ధి అంటూ ప్రకటించారు.. అలాగే పార్టీలో సమిష్టి నాయకత్వం ఏర్పడాల్సి ఉందని, దీనిపై 11 మంది సభ్యులతో కూడిన స్టీరింగ్ కమిటీ దృష్టి పెడుతుందని తెలిపారు.













