ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఉచ్చు బిగిస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఆయన ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల మేరకు పీఏను అధికారులు ప్రశ్నించారు. మద్యం కుంభకోణం కేసుకి సంబంధించి చార్జ్‌షీట్‌లో కేజ్రీవాల్‌ను పేరును ఈడీ ప్రస్తావించింది. తాజాగా ఆయన వ్యక్తిగత కార్యదర్శిని విచారించడం చర్చనీయంశంగా మారింది. కాగా, సౌత్ గ్రూపు నుంచి రూ.100 కోట్లు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్‌నాయర్ ్ తన మనిషి అని, విజయ్ను నమ్మొచ్చని ఫేస్‌టైం కాల్లో సమీర్ మహేంద్రుతో కేజ్రీవాల్ అన్నారని పేర్కొంది. కేజ్రీవాల్ ఎవరెవరు కలిసిందీ, ఎవరెవరు ఫోన్లో మాట్లాడిరదీ తెలిపింది. స్కామ్‌లో కీలక వ్యక్తులతో పాటు ఆయా సంస్థల్లో పనిచేస్తున్న వారి స్టేట్మెంట్లను చార్జిషీట్‌కు ఈడీ జత చేసింది.













