కేజ్రీవాల్ కు మరో షాక్ ..మరో ఆప్ నేత ఇంట్లో
దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన వేళ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు షాక్‌లు తగులుతున్నాయి. ఢిల్లీ వక్ఫ్‌బోర్డు చైర్మన్ అమానతుల్లా ఖాన్ ఈడీ దాడులు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో సోదాలు కొసాగాయి. చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఖాన్ ఢిల్లీ వక్ఫ్ బోర్డులో అక్రమ నియామకాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఏసీబీ, సీబీఐ ఆయనకు వ్యతిరేకంగా రెండు ఎఫ్ఐఆర్లను దాఖలు చేశాయి. చట్ట వ్యతిరేకంగా ఇప్పటి వరకు 32 మందిని నియమించారంటూఐ ఎఫ్ఐఆర్లో నమోదైంది. దీని ఆధారంగా ఆప్ నేతకు మనీలాండరింగ్ కేసుతో సంబంధం ఉందని అనుమానిస్తూ ఆయన నివాసంపై ఈడీ దాడులు ప్రారంభించింది. గతంలోనూ అక్రమ నియామకాలకు పాల్పడ్డారని అనుమానిస్తూ అమానతుల్లా ఖాన్‌ను ఏసీబీ అరెస్టు చేసింది.













