లిక్కర్ స్కాంలో మరో మలుపు.. మరో చార్జ్ షీట్ దాఖలు చేసిన ఈడీ
దేశంలో కలకలం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ మరో ఛార్జ్ షీట్ దాఖలు చేయడం ఆసక్తికరంగా మారింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ సందర్భంగా అనుబంధ ఛార్జ్ షీట్‌ను ఈడీ సమర్పించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాగుంట రాఘవ, గౌతమ్ మల్హోత్ర, రాజేశ్ జోషిలపై ఈడీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. ఫిబ్రవరి 7వ తేదీన గౌతమ్ మల్హోత్ర, 8న రాజేశ్ జోషి, 10న మాగుంట రాఘవను అరెస్ట్ చేసినట్టు ఈ ఛార్జ్ షీట్లో ఈడీ అధికాులు తెలిపారు. ఈ అనుబంధ ఛార్జ్ షీట్‌పై ఈ నెల 14వ తేదీన సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ జరుపుతుందని సమాచారం. అసలు ఈ కేసు దర్యాప్తులో ఇప్పుడు దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్ షీట్‌ను పరిగణనలోకి తీసుకోవాలా? వద్దా? అనే విషయంపై సీబీఐ ప్రత్యేక కోర్టు తన నిర్ణయాన్ని తెలపాల్సి ఉంది.













