తెలంగాణలో ముగిసిన కోడ్.. యధావిధిగా
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ ముగిసింది. ఈ మేరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎత్తివేస్తున్నట్లు ఈసీఐ ప్రకటించింది. ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఈసీ నిర్ణయం వెలువరించింది. దీంతో గత అక్టోబర్ తొమ్మిదో తేదీన అమల్లోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కేంద్ర ఎన్నికల సంఘం ఎత్తివేసింది. తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రా అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఎన్నికల కోడ్ ఎత్తివేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ తొలగినట్లయింది. ఈ ఎత్తివేత క్షణమే అమల్లోకి వస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.













