ఎగ్జిట్ పోల్స్ పై ఈసీ నిషేధం
త్వరలో జరిగే లోక్‌సభ, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని ఎన్నికల సంఘం ఎగ్జిట్ పోల్స్‌పై ఆంక్షలు విధించింది. ఏప్రిల్ 19 ఉదయం 7 గంటల నుంచి జూన్ 1 సాయంత్రం 6:30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ నిర్వహణ, వాటి ఫలితాల ప్రచురణ, ప్రసారంపై పూర్తి నిషేదం విధిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం పోలింగ్ ముగిసే 48 గంటల వ్యవధిలో ఒపీనియన్ పోల్ లేదా పోల్ సర్వేకు సంబంధించిన ఫలితాలు, అభిప్రాయాల వెల్లడి వంటివి ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో ప్రదర్శించడాన్ని నిషేధించినట్టు తెలిపింది.













