ఐదు రాష్ట్రాల్లో విజయోత్సవాలపై.. ఈసీ కీలక నిర్ణయం
దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఎంత కీలకంగా మరాయో తెలిసిందే. అయితే ఎన్నికల ఫలితాల సమయంలో వేడుకలు చేసుకోవడానికి వీల్లేదని ఎన్నికల సంఘం (ఈసీ) ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే ఫలితాలు అనంతరం పార్టీలకీ ఈసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ రాష్ట్రాల్లో విజేతలు వేడుకలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ రాష్ట్రాల్లో కరోనా పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవడం వల్లే విజయోత్సవాలపై నిషేధం ఎత్తివేస్తున్నట్లు ఈసీ పేర్కొంది. అంతకుముందు కరోనా మహమ్మారి కారణంగా విజయోత్సవ వేడుకలపై నిషేధం విధించామని, ఇప్పుడు పరిస్థితులు మారడంతో ఈ ఆంక్షలను సడలించామని తెలిపింది.













