ఐపీఎల్ 2020 స్పాన్సర్ గా డ్రీమ్ 11
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) టైటిల్ స్పాన్సర్‌గా డ్రీమ్ 11 ఎంపికైంది. టాటా సన్స్, రిలయన్స్ జియో, బైజూస్, అన్ అకాడమీ లాంటి దిగ్గజ కంపెనీలను వెనక్కి నెట్టి డ్రీమ్11 ఐపీఎల్ 2020 స్పాన్సర్‌గా నిలిచింది. ఓ దశలో పతంజలి సైతం ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ అవుతుందని భావించారు. రూ.222 కోట్లతో డ్రీమ్ ఎలెవన్ స్పాన్సర్షిప్ దక్కించుకుందని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేశ్ పటేల్ వెల్లడించారు. అయితే ఇప్పుడు ఈ డ్రీమ్ 11 సంస్థ కూడా ఐపీఎల్ స్పాన్సర్ గా ఉండటాన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఇందులో చైనా పెట్టుబడులు ఉన్నాయి. చైనాకి చెందిన టెన్సెంట్ కంపెనీ.. డ్రీమ్ 11లో 10 శాతం పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తుంది. దాంతో ఇది చైనా సంస్థ అని ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఈ సంస్థ ఐపీఎల్ స్పాన్సర్ గా ఉండటానికి వ్యతిరేకత పెరుగుతుంది.













