రాష్ట్రపతి కాదు.. ప్రధానే అవుతా
బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమాజ్‌వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌కు మాయావతి కౌంటర్ ఇచ్చారు. తనకు తిరిగి యూపీ సీఎం అవ్వాలని ఉందని, దాని తర్వాత దేశ ప్రధాని కావాలన్నదే తనకు ఉందని స్పష్టం చేశారు. అంతేకానీ రాష్ట్రపతి కావాలన్న కాంక్ష తనకు ఏమాత్రమూ లేదని తేల్చి చెప్పారు. యూపీ ఎన్నికల్లో బీఎస్పీ ఓట్లను మాయావతి బీజేపికి ఇచ్చేసిందని, ఇప్పుడు ఆమె రాష్ట్రపతి అవుతుందేమో అంటూ అఖిలేశ్ దెప్పి పొడిచారు. ఈ నేపథ్యంలోనే మాయావతి పై వ్యాఖ్యలు చేశారు.
సమాజ్‌వాదీ పార్టీ తమపై రోజు ఏదో పుకార్లు పుట్టిసూనే వుంటుందోంటూ మాయావతి విరుచుకుపడ్డారు. అయితే దళితులు, అణగారిన వర్గాలు, ముస్లింలు తిరిగి బీఎస్పీకి ప్రాణం పోస్తే సీఎం, ప్రధాని అవడం బాగా సులభమవుతుందని మాయవతి పేర్కొన్నారు. దీంతో తాజాగా అఖిలేష్‌కు మాయావవతి ఇలా కౌంటర్ ఇచ్చారు.













