భారత రక్షణ రంగంలో మరో మైలురాయి
భారత రక్షణ పరిశోధన సంస్థ డీఆర్డీవో మరో విజయం సాధించింది. లేజర్ కిరణాల సాయంతో లక్ష్యాన్ని ఛేదించే ట్యాంకు విధ్వంసక క్షిపణిని (ఏటీజీఎం) విజయవంతంగా పరీక్షించింది. నాలుగు కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఈ క్షిపణి పూర్తి కచ్చితత్వంతో తుత్తునియలు చేస్తుందని అధికారులు తెలిపారు. మహారాష్ట్ర అహ్మద్‌నగర్‌లోని ఆర్మర్డ్ కోర్ సెంటర్ అండ్ స్కూల్ (ఏసీసీ అండ్ఎస్)లో డీఆర్డీవో ఈ పరీక్షను నిర్వహించినట్లు పేర్కొన్నారు. మూడో తరానికి చెందిన ఎంబీటీ అర్జున్ యుద్ధ ట్యాంకుపై నుంచి దీని ప్రయోగించినట్లు తెలిపారు.













