రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము ప్రమాణస్వీకారం
భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటు స్రెంటల్ హాల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ద్రౌపది ముర్ముతో ప్రమాణం చేయించారు. సంప్రదాయ సంతాలీ చీరలో ఆమె ప్రథమ పౌరురాలిగా ప్రమాణసీకారం చేశారు. ఈ కారక్ర్రమానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, గవర్నర్లు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు, దౌత్య కార్యాయాల అధిపతులు / ప్రతినిధులు, ఉన్నతాధికారులు, ద్రౌపతి ముర్ము కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
అంతకుముందు ద్రౌపది ముర్ము ఢల్లీిలోని రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించారు. అనంతరం రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఊరేగింపుతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కలిసి పార్లమెంటు సెంట్రల్ హాలుకు చేరుకున్నారు. ఆ వెంటనే సైన్యం 21 సార్లు గాల్లోకి కాల్పులు జరిపి నూతన రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పించింది. పార్లమెంట్‌కు చేరుకోగానే ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం సెంట్రల్ హాలులో సీజేఐ రాజ్యాంగంలోని ఆర్టికల్ 60ప్రకారం ఆమెతో ప్రమాణం చేయించారు.













