భారత నూతన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము
భారత నూతన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా పై భారీ మెజార్టీతో విజయం సాధించారు. భారత 15వ రాష్ట్రపతిగా ఆమె జులై 26న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారత దేశానికి ఆమె రెండో మహిళా రాష్ట్రపతి. గిరిజన సామాజిక వర్గం నుంచి అత్యున్నత రాజ్యాంగ పదవికి ఎన్నికైన మొట్ట మొదటి వ్యక్తిగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు. భారత రాష్ట్రపతిగా ఎన్నికైన సంద్భంగా ఆమెకు ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రులు, ఎంపీలు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి శుభాంకాంక్షలు చెప్పారు.













