నెలలోపే ఆలయా నిర్మాణానికి రూ.వెయ్యి కోట్ల విరాళాలు
అయోధ్యలో రామాలయం నిర్మాణానికి ఇప్పటి వరకు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా విరాళాలు అందాయి. రామాలయ నిర్మాణానికి గత నెలలో విరాళాల సేకరణ ప్రారంభమైంది. అన్ని వర్గాల ప్రజలూ ఆలయ నిర్మాణానికి విరాళాలు ఇస్తున్నారు. సుమారు 1.50 లక్షల మంది వీహెచ్పీ కార్యకర్తలు రామాలయం కోసం నిధుల్ని సమీకరిస్తున్నారు. సేకరించిన మొత్తాల్ని బ్యాంకు ఖాతాల్లో వేసేందుకు 37 మంది కార్యకర్తల్ని నియించాం. ఈ నెల రోజుల్లో మూడు జాతీయ బ్యాంకుల్లో ఉన్న శ్రీరామ జన్యభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఖాతాల్లో వెయ్యి కోట్ల రూపాయలకు పైగా జమ అయ్యాయని ఆ ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు.













