ఉక్రెయిన్ నుంచి భారత్‌కు వచ్చే విద్యార్థులు తప్పనిసరిగా…
ఉక్రెయిన్ నుంచి భారత్‌కు వచ్చే విద్యార్థులందరికీ ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహిస్తామని ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు సిబ్బంది ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్టు స్పెషల్ కారిడార్‌ను మూసివేశామని పేర్కొన్నారు. ఉక్రెయిన్ నుంచి వచ్చే విద్యార్థులు తప్పనిసరిగా కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లేదా నెగిటివ్ ఆర్టీపీసీఆర్ రిపోర్టు చూపించాలని తెలిపారు. ఒక వేళ ఈ రెండు పత్రాలు చూపించని యెడల, అలాంటి విద్యార్థులకు ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహిస్తామన్నారు. ఆ ఖర్చు ఎయిర్‌పోర్టు అధికారులే భరిస్తారని తెలిపారు. ఈ పరీక్షలో నెగిటివ్ వచ్చిన విద్యార్థులు తమ స్వస్థలాలకు వెళ్లిపోవచ్చు. ఒక వేళ ఎవరికైనా పాజిటివ్ అని తేలితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం సదరు వ్యక్తిని క్వారంటైన్లో ఉంచుతామని ప్రకటించారు.













