వ్యాక్సిన్ వచ్చేవరకు జాగ్రత్త : ప్రధాని
దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతున్న వేళ ప్రజలంతా మాస్క్ లు ధరించి, భౌతికదూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ను అంత తేలిగ్గా తీసుకోవద్దన్నారు. బిహార్లో రూ.20,050 కోట్లతో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, తదితర కార్యక్రమాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన ప్రధాని ఈ కీలక సూచనలు చేశారు. శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ అభివృద్ధి చేసేవరకు జాగ్రత్తగా ఉండాలి, రెండు గజాల దూరం పాటించాలన్నారు. కుటుంబంలోని వయో వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయొద్దని కోరారు.













