మోదీ కూడా ముస్లిం టోపీ పెట్టుకుంటారు.. ‘భారత్ జోడో యాత్ర’తో బీజేపీలో వణుకు: దిగ్విజయ్ సింగ్
కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ దిగ్విజయంగా సాగుతోందని ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కొనియాడారు. భారత్ జోడో యాత్ర వల్ల వణుకుపుట్డి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ప్రస్తుతం మసీదులు, మదరసాల్లో పర్యటనలు చేస్తున్నారని చెప్పారు. ఇండోర్లో మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించడంలో బీజేపీ చాలా బిజీగా ఉండేదని, కానీ భారత్ జోడో యాత్ర ప్రారంభమైన నెలరోజుల్లోనే వారిలో బెదురు మొదలైందని అన్నారు. అందుకే మోహన్ భగవత్ కూడా మసీదులు, మదరసాల చుట్టూ తిరుగుతున్నారని, త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీ కూడా ముస్లిం టోపీ పెట్టుకునే రోజు వస్తుందని విమర్శించారు.













