‘ద్రోహి’ సింధియా లేడు కదా.. మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌దే: దిగ్విజయ్ సింగ్
మధ్యప్రదేశ్‌లో కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీకి సులభంగా 130 సీట్లు వస్తాయని చెప్పాడు. అయితే ఎగ్జిట్ పోల్స్‌లో చాలా వరకు బీజేపీ గెలుస్తుందని అంచనా వేశాయి. మరికొన్ని సంస్థలు రెండు పార్టీల మధ్య గట్టి పోటీ ఉందని చెప్పాయి. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేల కొనుగోలు జరుగుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. దీనిపై స్పందించిన దిగ్విజయ్.. ‘అలాంటిదేం ఉండదు. ఇప్పుడు పార్టీలో జ్యోతిరాదిత్య సిందియా లేడు కదా. కాబట్టి ద్రోహులు ఎవరూ లేరు’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. కొన్నిరోజుల క్రితం మధ్యప్రదేశ్‌లో ప్రచారం సందర్భంగా ప్రియాంక గాంధీ కూడా సింధియాను ద్రోహి అనడం గమనార్హం.













