పార్లమెంట్ ఆవరణలో.. ఇక నుంచి నిషేధం
పార్లమెంట్ ఆవరణలో ధర్నాలు, నిరసనలు, దీక్షలు, మతపరమైన కార్యక్రమాలను ఇక నుంచి అనుమతించడం లేదు. దీనికి సంబంధించిన సర్క్యూలర్‌ను రాజ్యసభ సెక్రటరీ జారీ చేశారు. జూలై 18 నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాజ్యసభ కార్యదర్శి జనరల్ పీసీ మోడీ ఈ కొత్త ఆదేశాలను ఓ బులెటిన్‌లో తెలిపారు. సభ్యులందరూ సహకరించాలని ఆయన కోరారు. గతంలో విపక్షాలు పార్లమెంట్ కాంప్లెక్స్ లోపల, గాంధీ విగ్రహం ముందు నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. రాజ్యసభ కార్యదర్శి తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ ఖండిరచారు. విశ్వగురు కొత్త నాటకమని, ధర్నా మనా హై అంటూ జైరాం తన ట్విట్టర్లో ఆరోపించారు.













