శరద్ పవార్ తో భేటీ అయిన మాజీ సీఎం ఫడణ్వీస్

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో భేటీ అయ్యారు. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా సంచలన రేగింది. అయితే ఇది మర్యాద పూర్వక భేటీయే అని దేవేంద్ర ఫడణ్‌వీస్ ట్వీట్ చేయడంతో టెన్షన్ తగ్గిపోయింది. వీరిద్దరూ ఇలా కలుసుకోవడంతో రాజకీయంగా ఏదైనా ప్రాధాన్యం ఏర్పడుతుందేమోనని అందరూ భావించారు. అయితే మర్యాదపూర్వకంగానే కలిశానని ఫడణ్‌వీస్ తేల్చేయడంతో ఉత్కంఠ వీడిపోయింది. తాను ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో ఆయన నివాసంలో భేటీ అయ్యాయని, ఇది కేవలం మర్యాద పూర్వక సమావేశమేనని ఫడ్నవీస్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోను కూడా షేర్ చేశారు. కొన్ని రోజుల క్రిందటే శరద్ పవార్‌కు శస్త్ర చికిత్స జరిగింది. ఈ చికిత్స తర్వాత శరద్ పవార్‌తో భేటీ అయిన మొదటి బీజేపీ నేత ఫడ్పవీసే.