మనీష్ సిసోడియాకు షాక్… జ్యూడీషియల్ కస్టడీ పొడిగింపు
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని సీబీఐ కోర్టు ఈ నెల 17వ తేదీ వరకు పొడిగించింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని సీబీఐ కోర్టుకు తెలిపింది. దర్యాప్తు సంస్థ వాదనలు విన్న కోర్టు కస్టడీని పొడిగించింది. మద్యం పాలసీ వ్యవహారంలో ఫిబ్రవరి 26న మనీష్ సిసోడియా సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దాదాపు ఎనిమిది గంటలకు పైగా విచారించిన ఆయనను అరెస్టు చేసినట్లు సీబీఐ ప్రకటించింది. ఆ తర్వాత ఢల్లీిలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. ఆ తర్వాత సీబీఐ కస్టడీకి ఇచ్చింది. విచారణ అనంతరం ఆయను జ్యుడీషియల్ కస్టడీపై జైలుకు పంపింది.













